logo
Published : 30/11/2021 06:29 IST

కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి 


సమీక్షిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

 

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాకు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించి, త్వరగా కొలిక్కితేవాలని అధికారులను కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. సోమవారం ఆయన స్పందన మందిరంలో అధికారులతో సమీక్షించారు. కోర్టు నుంచి వచ్చే నోటీసుకు నిర్దేశిత గడువులోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పక్షోత్సవాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలన్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

వాయుగుండంపై అప్రమత్తం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి డిసెంబరు 4, 5 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో తీరం దాటే వీలుందని, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువలు, చెరువులు, కరకట్టల పటిష్టతను నీటిపారుదల శాఖ అధికారులు ముందుగా పరిశీలించాలన్నారు. ముంపు వస్తే పంట పొలాలను రక్షించే విధంగా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. జేసీలు సుమిత్‌కుమార్‌, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని