logo
Published : 30/11/2021 06:29 IST

ఆర్టీసీలో ఎన్నికల సందడి


రాజమహేంద్రవరం డిపో

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం) : ఉద్యోగులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీలో ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌)కి సంబంధించి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలోని అన్ని డిపోల్లో అభ్యర్థుల నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌, వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, యునైటెడ్‌ వర్కర్స్‌ అసోసియేషన్లు రంగం సిద్ధం చేసుకున్నాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 3,113 మంది ఓటర్లున్నారు. వీరు ఆయా డిపోల పరిధిలో కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ సభ్యులను ఎన్నుకుంటారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డిపోల నుంచి ఇద్దరేసి అభ్యర్థులను, మిగతా ఆరు డిపోల నుంచి ఒక్కో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

షెడ్యూల్‌ ఇలా..

 

అభ్యర్థుల నుంచి నామపత్రాలను ఆయా డిపో మేనేజర్లు వచ్చే నెల 6 వరకు స్వీకరింస్తారు. 7న అర్హత సాధించినవారి జాబితా ప్రదర్శిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 10వ తేదీ వరకు గడువు ఉంది. అదే రోజు సాయంత్రం బరిలో అభ్యర్థులను ప్రకటిస్తారు. 14న ఎన్నిక నిర్వహించి 15న ఫలితాలు వెల్లడిస్తారు. పాలక మండలి సభ్యుల ఎన్నిక 29న విజయవాడలోని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది.

ఓటర్ల వివరాలు డిపోల వారీగా..

రాజమహేంద్రవరం - 552, కాకినాడ - 556, తుని - 27, అమలాపురం - 480, ఏలేశ్వరం - 230, గోకవరం - 260, రామచంద్రపురం - 253, రావులపాలెం - 280, రాజోలు - 225

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని