logo
Published : 30/11/2021 06:29 IST

‘పవిత్ర గోదావరి తీరంలో మతమార్పిడులు సరికాదు’

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పవిత్ర గోదావరి తీరంలో అన్య మత ప్రచారం, మార్పిడులకు పాల్పడడం సరికాదని హిందూ చైతన్య వేదిక కన్వీనర్‌ పట్నాల సూరిబాబు, విశ్వ హిందూ పరిషత్‌ కన్వీనర్‌ బాబు, ధర్మవీర్‌ విజయ్‌, ఉమా మార్కండేయ పురోహిత సంఘం అధ్యక్షుడు భమిడిపల్లి వెంకట రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని మార్కండేయస్వామి ఆలయం ఎదుట ఉన్న తితిదే ఘాట్లో 2018 కార్తిక మాసంలో మత మార్పిడులు, ప్రచారం చేయడంతో అప్పట్లో హిందూ ధార్మిక సంఘాలు అడ్డగించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని నిరోధించారన్నారు. మూడేళ్ల తర్వాత తిరిగి కార్తిక సోమవారం రోజున తితిదే ఘాట్లో అదే పాస్టర్‌ తన అనుచరులతో మత ప్రచారం చేశారన్నారు. దీనిపై పాస్టర్‌ను నిలదీయగా సబ్‌కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని చెప్పారన్నారు. సబ్‌కలెక్టర్‌ వద్దకు మాట్లాడేందుకు వెళ్లగా ఆమె తమను పంపించేశారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందించామన్నారు. జిల్లా కలెక్టర్‌కు పోస్ట్‌లో వినతి పత్రం పంపించామని, మంగళవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని