logo
Published : 30/11/2021 06:29 IST

సర్వేజనా..సుజలోభవంతు


యాత్ర చేస్తున్న ముకుల్‌ శర్మ, నీతూచోప్రా

రాజమహేంద్రవరం నగరం: భవిష్యత్తు తరాలకు నీటి ఇబ్బందులు రాకుండా ప్రతి బొట్టునూ పొదుపుగా వాడుకుందాం..అనే నినాదంతో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు భారతదేశ యాత్ర నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తూ రాజమహేంద్రవరంలో గోదావరిని పరిశీలించారు. ముకుల్‌ శర్మ, నీతూచోప్రా ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. సెప్టెంబరు 21న లద్దాక్‌లోని కర్ధుంగళా నుంచి యాత్ర ప్రారంభించామన్నారు. 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా జనవరి 7, 2022 నాటికి దిల్లీ చేరుకుంటామన్నారు. మార్గంలో యువతకు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నీతూచోప్రా గతంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 18 రోజుల్లో 18 రాష్ట్రాల మీదుగా 4,600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు చెప్పారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని