logo
Updated : 02/12/2021 06:40 IST

మాజీ ఎమ్మెల్యే వల్లూరి కన్నుమూత

మండపేట: పూర్వపు ఆలమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు (76) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ సరోజిని, కుమార్తె వెంకటసూర్యకుమారి, కుమారుడు నామస్వామి చౌదరి ఉన్నారు. తెదేపా ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వెంట ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తొలిసారి 1983, 1985వ సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా పేరు పొందారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణరావు మృతి తెదేపాకు తీరని లోటని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఏడిద సంగమేశ్వరంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యేతోపాటు పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని