logo
Published : 02/12/2021 06:33 IST

సౌత్‌జోన్‌ పోటీలకు జట్లు ఎంపిక


ఎంపికైన క్రీడాకారులతో శ్యామ్‌కుమార్‌ తదితరులు

కాకినాడ(భానుగుడి సెంటర్‌), న్యూస్‌టుడే: సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి వర్సిటీ కీర్తి ప్రతిష్టలు పెంచాలని జేఎన్టీయూకే క్రీడా విభాగాధిపతి జి.శ్యామ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని ద్రోణ అకాడమీలో ఈ నెల 3 నుంచి నిర్వహించే సౌత్‌జోన్‌ పోటీలకు జేఎన్టీయూకే బ్యాడ్మింటన్‌ పురుష, మహిళ విభాగాల జట్లను ఎంపిక చేశారు. వర్సిటీ పురుషుల విభాగం నుంచి 122 మంది క్రీడాకారులు హాజరుకాగా, అయిదుగురు ఎంపికయ్యారు. వారిలో ఎస్‌.సైలేష్‌ కుమార్‌, జి.శ్రీచరణ్‌ (సీఆర్‌ రెడ్డీ ఇంజినీరింగ్‌ కళాశాల, ఏలూరు), పి.శేషసాయి, బి.అనిల్‌కుమార్‌, కె.మేఘశ్యామ్‌ (శ్రీవాసవి ఇంజినీరింగ్‌ కళాశాల, తాడేపల్లిగూడెం) ఉన్నారు. మహిళల విభాగం నుంచి 23 మంది హాజరుకాగా అయిదుగురితో జట్టును ఎంపిక చేశారు. వారిలో పి.అక్షిత (విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, విశాఖపట్నం), బి.చంద్రహరిక (ఆదర్శ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌), ఎన్‌.సాయి శ్రీలక్ష్మి (శ్రీవాసవి ఇంజినీరింగ్‌ కళాశాల, తాడేపల్లిగూడెం), ఆర్‌.జాష్య (జీవీపీ ఇంజినీరింగ్‌ ఆఫ్‌ ఉమెన్‌, విశాఖపట్నం) టి.హేమలత (రఘు ఇంజినీరింగ్‌, భీమునిపట్నం) ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి కె పద్మనాభం, జేఎన్టీయూకే పీడీలు ఎం.వెంకటేశ్వరరావు, మహిదుర్గా పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని