logo
Published : 02/12/2021 06:33 IST

ఉత్సాహంగా రాష్ట్రసా్థయి చిత్రలేఖన పోటీలు

బొమ్మలు గీస్తున్న విద్యార్థులు, పర్యవేక్షిస్తున్న అధికారులు

రాజవొమ్మంగి: కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అల్లూరి సీతారామరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలు లెవెల్‌-1 జరిగాయి. 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్‌ అధికారి టి.మల్లయ్య మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నోడల్‌ ఏజెన్సీగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజవొమ్మంగి, విజయవాడ తదితర ప్రాంతాల్లో అయిదు నుంచి పదోతరగతి చదువుతున్నవారికి పోటీలు నిర్వహించి విజేతలకు ఏ, బీ కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు, ప్రోత్సాహక బహుమతులిస్తారన్నారు. అతిథులుగా బాలమ్మ, శ్రీనివాసరావు, కొండబాబు, దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని