logo
Published : 02/12/2021 06:33 IST

పోర్టు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో తనిఖీలు


ఎస్పీకి మొక్క అందిస్తున్న పోర్ట్‌ సిబ్బంది

మసీదుసెంటర్‌(కాకినాడ): కాకినాడ సీ పోర్టు ఆవరణలో ఉన్న పోర్ట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి కార్యాలయ నిర్వహణకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. అనంతరం పీఆర్‌వో అబ్బారెడ్డికి పలు సూచనలు చేశారు. ఇమిగ్రేషన్‌ సంబంధించి సిబ్బంది సైన్‌ ఇన్‌, సైన్‌ ఆఫ్‌ తనిఖీ పటిష్టంగా జరగాలని చెప్పారు. బ్యాగుల తనిఖీలకు స్కానర్లను ఉపయోగించాలన్నారు. అనంతరం పోర్ట్‌ భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) కార్యాలయం, కస్టమ్స్‌ శాఖ కార్యాలయాలను సందర్శించారు. ఎస్పీ వెంట ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, ఎస్‌పీఎఫ్‌ ఆర్‌ఐ శేషారావు, కాకినాడ సీపోర్టు ఈఈ పుల్లారావు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని