logo
Published : 02/12/2021 06:33 IST

విలాసాలకు అలవాటుపడి.. ద్విచక్రవాహనాల చోరీ


స్వాధీనం చేసుకున్న వాహనాలు

రాజోలు, న్యూస్‌టుడే: విలాసాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరిస్తున్న దొంగను రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఊసులమర్రుకు చెందిన భారతి ఏసు అలియాస్‌ చిన్న జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్నాడు. రాజోలులోని అత్తారింటి వద్ద దాచి, ఒక్కోటి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గతనెల 24న వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం శివకోటి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా చిక్కాడు. రాజోలులో అయిదు, మామిడికుదురులో రెండు, ఉప్తలగుప్తం, అమలాపురం రూరల్‌, ఇరగవరంలో ఒక్కోటి చొప్పున మొత్తం పది వాహనాలు చోరీ చేసినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని