Published : 02 Dec 2021 06:33 IST
వివాహిత అనుమానాస్పద మృతి
బిక్కవోలు, న్యూస్టుడే: బిక్కవోలులోని కొత్తపేటకు చెందిన ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు ఎస్సై పి.వాసు తెలిపారు. ఆమె తండ్రి, ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం కడియం మండలం వేమగిరికి చెందిన 17 ఏళ్ల బాలిక బిక్కవోలుకు చెందిన అంజి అనే వ్యక్తిని ప్రేమించి మూడు నెలల కిందట ఆయన వెంట వచ్చేసింది. గత నెల 27న అంజి ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి కాకినాడ ఆసుపత్రిలో ఉందని చెప్పాడు. మళ్లీ 29న తిరిగి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పాడని ఆయన తమకు ఫిర్యాదు చేశారని ఎస్సై వెల్లడించారు. ఆమె భర్త అంజి, అతని తల్లిదండ్రులపై తనకు అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Tags :