logo
Published : 02/12/2021 06:33 IST

సముద్రంలో మునిగి యువకుడి దుర్మరణం


మృతిచెందిన రాజు

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరంలో మునిగి ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మత్స్యకారులు, మెరైన్‌ పోలీసుల సాయంతో మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన వానపల్లి రాజు, వానపల్లి సాయి, పెంకె ప్రసాద్, గణేష్‌ బుధవారం ఉదయం సముద్ర తీరానికి వచ్చారు. ఇక్కడి పరిసరాల్లో సేద తీరి, సాయంత్రం సముద్ర స్నానానికి దిగారు. వీరిలో వానపల్లి రాజు (30), పెంకె ప్రసాద్‌ లోతుకు వెళ్లగా అకస్మాత్తుగా మునిగిపోయారు. దీంతో సాయి, గణేష్‌ కేకలు వేయడంతో ఇక్కడి మత్స్యకారులు, మెరైన్‌ సిబ్బంది అప్పలరాజు, శ్రీను, శంకర్, గోవింద్‌ సముద్రంలోకి దిగి ఇద్దరిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజుకు సపర్యలు చేసి, స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే రాజు మృతి చెందినట్లు తెలిపారు. ప్రసాద్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


ప్రాణాలతో బయటపడ్డ ప్రసాద్‌ 

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని