logo
Published : 02/12/2021 06:33 IST

నిరుద్యోగులకు టోకరా

వైద్యారోగ్య శాఖ పేరిట నకిలీ నియామక పత్రాలు


ఓ అభ్యర్థికి ఇచ్చిన పత్రం 

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్‌టుడే, కాకినాడ (బాలాజీ చెరువు) నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని వసూళ్లుకు పాల్పడ్డారు. నియామక పత్రాలూ ఇచ్చారు. ఆ పత్రాలతో సదరు కార్యాలయానికి వెళితే ఇవన్నీ నకిలీవి.. మిమ్మల్ని మోసం చేశారని చెప్పడంతో వారి గుండెల్లో రాయిపడింది.  జిల్లాకు చెందిన యువతీ, యువకులు బుధవారం విశాఖపట్నం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరడానికి ప్రయత్నించే క్రమంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితులు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ వారే. కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న కొందరు ఇందులో సూత్రధారులని తెలుస్తోంది. జూనియర్‌ అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల పేరుతో 60 మందికి నకిలీ నియామక పత్రాలు జారీచేశారు. వీటిపై కేంద్ర ప్రభుత్వ రాజముద్రను కూడా వినియోగించడం విశేషం.

కార్యాలయమే లేదు..
రాజమహేంద్రవరంలో ఆర్యాపురానికి చెందిన పిల్లి అనిల్‌కుమార్‌ పేరిట జూనియర్‌ అసిస్టెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌) ఉద్యోగం వచ్చినట్లు ఓ నియామక పత్రం ఇచ్చారు. అందులో విశాఖలో జాయింట్‌ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో విధుల్లో నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి విశాఖలో అలాంటి కార్యాలయమే లేదు. అతనికే కాదు అందరి ఉత్తర్వుల్లోనూ అలానే ఉంది. మౌఖిక పరీక్షల కోసం మంగళవారం విశాఖ కలెక్టరేట్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఉద్యోగాలొచ్చాయన్న సంతోషంతో వారంతా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడేమీ ఏర్పాట్లు లేకపోవడంతో వారిలో అనుమానం మొదలైంది. అయితే నియామక ఉత్తర్వుల్లో డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాలని ఉండడంతో బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి తాము ఎక్కడ చేరాలో ఆరా తీయడంతో నిజం బయటపడింది. అభ్యర్థులంతా తమతో వచ్చిన మధ్యవర్తిని నిలదీశారు. మేం కట్టిన డబ్బులైనా ఇవ్వండి లేదా ఉద్యోగమైనా చూపండని అతన్ని చుట్టుముట్టారు. ‘ఇందులో నా తప్పేమీ లేదు, మీరిచ్చిన డబ్బులు వేరేవారికి ఇచ్చా.. కాకినాడ వెళ్లాక అతనితో ఇప్పించేస్తాన’ని మధ్యవర్తి వారితో రాజీకి వచ్చాడు. దీంతో వారంతా ఎక్కడా ఫిర్యాదు చేయకుండానే తిరుగుముఖం పట్టారు.  దీనిపై డీఎంహెచ్‌వో కార్యాలయంలోని జనరల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మంగరాజు వద్ద ప్రస్తావించగా వారు తెచ్చిన ఉత్తర్వులు చూశామని అవన్నీ నకిలీవేనన్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించామన్నారు.


 ఉద్యోగాల కోసం వచ్చి మోసపోయిన బాధితులు 

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని