logo

చదువుకోవాలని ఉంది... సార్‌

నల్లచెరువు శివారు పండ్యాల చెరువుకు చెందిన గణేశుల శ్రీనివాస్‌, మహాలక్ష్మి దంపతుల కుమార్తె గణేశుల లీలాదుర్గాభవాని ఏడోఏటవరకు బాగానే ఉంది. ఎనిమిదో ఏట కాళ్లు చచ్చుబడిపోయాయి. కుమార్తెకు చదువుపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకెళ్లగా పది వరకు చదువుకుంది.

Published : 05 Dec 2021 06:26 IST


పింఛను సొమ్ము అందిస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు

పి.గన్నవరం: నల్లచెరువు శివారు పండ్యాల చెరువుకు చెందిన గణేశుల శ్రీనివాస్‌, మహాలక్ష్మి దంపతుల కుమార్తె గణేశుల లీలాదుర్గాభవాని ఏడోఏటవరకు బాగానే ఉంది. ఎనిమిదో ఏట కాళ్లు చచ్చుబడిపోయాయి. కుమార్తెకు చదువుపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకెళ్లగా పది వరకు చదువుకుంది. ఆమెకున్న సదరం ఐడీతో రెండేళ్లుగా వేరొకరు సామాజిక పింఛను తీసుకున్నారు. దీనిపై అధికారుల చుట్టూ తిరిగారు. విషయాన్ని గ్రహించిన అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్‌.విజయ చొరవ తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో ఇటీవల పింఛను మంజూరైంది. ఈ మొత్తాన్ని శనివారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అందించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని ఆమె ఎమ్మెల్యేకు వివరించింది. సంబంధిత చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని