logo

చిన్నారి అపహరణ.. 24 గంటల్లో అప్పగింత

మండలంలోని పసలపూడిలో ఆరు నెలల చిన్నారి అపహరణ కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై పీˆవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవర జానకి ఇద్దరు పిల్లలతో స్థానిక ఓం శాంతి ఆశ్రమం వెనుక గుడారాల్లో బంధువులతో కలిసి నివసిస్తోంది.

Published : 05 Dec 2021 06:26 IST


రాయవరం, న్యూస్‌టుడే: మండలంలోని పసలపూడిలో ఆరు నెలల చిన్నారి అపహరణ కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై పీˆవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవర జానకి ఇద్దరు పిల్లలతో స్థానిక ఓం శాంతి ఆశ్రమం వెనుక గుడారాల్లో బంధువులతో కలిసి నివసిస్తోంది. గొడుగులు బాగుజేసుకుంటూ.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. 2వ తేదీ రాత్రి ఆరు నెలల చిన్నారి శైలుని నిద్రపుచ్చి, భోజనం చేస్తుండగా గుర్తుతెలియని ఆగంతకులు వచ్చారు. అలికిడిని గుర్తించి ఆమె వచ్చేసరికే చిన్నారిని అప్పటికే సిద్ధంగా ఉంచిన ఆటోపై రామచంద్రపురం బైపాస్‌ రహదారి వైపు తీసుకొని వెళ్లిపోయారు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో 3న పోలీసులకు ఫి‡ర్యాదు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. రామచంద్రపురానికి చెందిన గంపల విజయశేఖర్, ముత్యాల భవాని ప్రసాద్, శెట్టి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని, చిన్నారి శైలును తల్లికి అప్పగించారు. భిక్షాటన చేసేవారికి విక్రయించేందుకు చిన్నారిని అపహరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఆయన తెలిపారు. నిందితులను అనపర్తి మేజిస్ట్రేటు ఎదుట హాజరుపరిచామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని