logo

‘మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే’

వీఆర్వోల మనోభావాలను దెబ్బతీసిన మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చేపాల్సిందేనని పెద్దపురం డివిజన్‌ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు చంటిబాబు డిమాండ్‌ చేశారు. శనివారం తహసీల్దారు కార్యలయం వద్ద ఆరుబయట విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Published : 05 Dec 2021 06:26 IST


తునిలో నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్వోలు

తుని గ్రామీణం: వీఆర్వోల మనోభావాలను దెబ్బతీసిన మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చేపాల్సిందేనని పెద్దపురం డివిజన్‌ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు చంటిబాబు డిమాండ్‌ చేశారు. శనివారం తహసీల్దారు కార్యలయం వద్ద ఆరుబయట విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులను చులకనగా చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. మండల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు, శంఖవరం: సచివాలయాలకు వెళ్లకుండా తహసీల్దారు కార్యాలయం ఆవరణలోనే వీఆర్వోలు విధులు నిర్వర్తిస్తూ నిరసన తెలిపారు. సంఘ నాయకులు దిలీప్, సాయివర్మ, దుర్గాప్రసాద్, జక్కయ్య పాల్గొన్నారు. శంఖవరంలో వీఆర్వోలు మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 
కిర్లంపూడి: మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ మండలంలోని వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మంత్రి క్షమాపణ చెప్పేంత వరకు నిరసన కొనసాగిస్తామని ఆ  సంఘం అధ్యక్షుడు మందేటి గుర్రయ్య తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని