logo

పేదలపై భారం తగదు

ఓటీఎస్‌ వెంటనే రద్దు చేయాలని మాజీమంత్రి గొలపల్లి సూర్యారావు డిమాండు చేశారు. తెదేపా నాయకులతో కలిసి తహసీల్దారు కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన గృహాలపై వసూళ్లు చేయడం తగదన్నారు. తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి

Published : 05 Dec 2021 06:26 IST


నినాదాలు చేస్తున్న గొల్లపల్లి, తెదేపా నాయకులు

మామిడికుదురు, న్యూస్‌టుడే: ఓటీఎస్‌ వెంటనే రద్దు చేయాలని మాజీమంత్రి గొలపల్లి సూర్యారావు డిమాండు చేశారు. తెదేపా నాయకులతో కలిసి తహసీల్దారు కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన గృహాలపై వసూళ్లు చేయడం తగదన్నారు. తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. నాయకులు ఈలి శ్రీనివాస్, వర్థినేని బాబ్జీ, వాసంశెట్టి శంకర్రావు, కంచి విశ్వనాథం, మానేపల్లి రామకృష్ణ, యెరుబండి మాచరయ్య తదితరులు పాల్గొన్నారు. 
కొత్తపేట: సంపూర్ణ గృహహక్కు పేరుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని అమలాపురం పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆరోపించారు. కొత్తపేటలో ఆమె మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని