logo

గుత్తేదారుల వెనకడుగు

అమలాపురం డివిజన్‌లో ర.భ.శాఖ రహదారుల పరిస్థితి అత్యంతదారుణంగా ఉంది. భారీ వర్షాలకు రహదారులు మరింత దుర్భరంగా మారాయి. డివిజన్‌ మొత్తం మీద 1079 కిలోమీటర్ల పొడవున ఆ శాఖ రహదారులు ఉంటే వీటిలో సుమారు 400 కిలోమీటర్లమేర రహదారులు దుర్భరంగా మారాయి.

Published : 05 Dec 2021 06:26 IST

రూ.150 కోట్లకు టెండర్లు పిలిచినా స్పందన కరవు
 డివిజన్‌లో 400 కిలోమీటర్ల ర.భ.శాఖ రోడ్లు అధ్వానం 


అధ్వానంగా బెల్లంపూడి-నరేంద్రపురం రహదారి దుస్థితి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: అమలాపురం డివిజన్‌లో ర.భ.శాఖ రహదారుల పరిస్థితి అత్యంతదారుణంగా ఉంది. భారీ వర్షాలకు రహదారులు మరింత దుర్భరంగా మారాయి. డివిజన్‌ మొత్తం మీద 1079 కిలోమీటర్ల పొడవున ఆ శాఖ రహదారులు ఉంటే వీటిలో సుమారు 400 కిలోమీటర్లమేర రహదారులు దుర్భరంగా మారాయి. రహదారులు గుంతలుపడి వాహనచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లోపడి వాహనాలు దెబ్బతింటున్నాయి. రూ.150కోట్లతో వివిధ రహదారులను అభివృద్ధి చేసేందుకు పలుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందనరాని పరస్థితి నెలకొంది.

అయిదు రహదారులకు టెండర్లు
ఎన్‌.డి.బి. నిధులు రూ.50 కోట్లతో అయిదు రహదారులను అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ‘మురమళ్ల-ఎదుర్లంక’ ‘ముమ్మిడివరం-కాట్రేనికోన’, ‘ముమ్మిడివరం-ముక్తేశ్వరం’, ‘చింతలపల్లి-మలికిపురం’, ‘విశ్వేశ్వరాయపుర-దిండి’ ఇలా అయిదు రహదారులు అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఇవి కాకుండా వేరే గ్రాంట్లతో రూ.150కోట్ల విలువైన వివిధ రహదారులు అభివృద్ధి చేసేందుకు టెండర్లుపిలిస్తే గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. వాటికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నాం. అన్నిరహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- జి.శ్రీనివాసనాయక్, ఈఈ., ర.భ.శాఖ, అమలాపురం డివిజన్‌ 

మరీ దుర్భరంగా ఉన్న మార్గాలు..
జి.పెదపూడి నుంచి పొదలాడవరకు (రాజవరం-పొదలాడ రోడ్డు)
*  అమలాపురం నుంచి రావులపాలెం (అమలాపురం-బొబ్బర్లంకరోడ్డు)
*  అంబాజీపేట-గన్నవరం (ఎ.-జి.రోడ్డు)   
*  బెల్లంపూడి-నరేంద్రపురం రోడ్డు.  
* ముక్కామల-నేదునూరు రోడ్డు
* ముక్తేశ్వరం-అమలాపురం రోడ్డు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని