logo
Published : 05/12/2021 06:26 IST

టెండర్ల గడువు మళ్లీ పెంపు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో ధ్వంసమైన దారులు ఎప్పటికి బాగుపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.  ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క బిడ్డూ దాఖలు కాలేదు. తాజాగా ఎస్‌ఆర్‌ఆర్‌ ధరలు పెంచి పిలిచినా నాలుగోసారి నిరాశే ఎదురైంది. 
* పదేపదే పిలిచినా...:  గతనెల 5న 457.242 కి.మీ. మేర 78 రోడ్లను బాగు చేయడానికి రూ.119.52 కోట్లతో, 159.146 కి.మీ. మేర 19 రహదారుల మరమ్మతులకు రూ.79.73 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటికి గతనెల 26 వరకు గడువు ఇచ్చారు. ఒక్క పనికి కూడా బిడ్డు దాఖలు కాలేదు. దీంతో ఈనెల 3 వరకు టెండర్ల గడువు పెంచారు. ఇప్పుడు కూడా దాఖలు కాకపోవడంతో ఈనెల 7 వరకు కొన్ని, 9 వరకు మరికొన్ని పనులకు గడువు ఇవ్వాలని ర.భ.శాఖ చీఫ్‌ ఇంజినీరు కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు స్పందించడం లేదు. సుమారు రూ.200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల గతంలో చేసిన తాత్కాలిక మరమ్మతులకు తక్కువ మొత్తంలో బిల్లులు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు పిలిచిన వాటికి బిడ్లు దాఖలు చేయాలని అధికారులు గుత్తేదారులను కోరుతున్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇస్తేనే బిడ్లు వేస్తామని గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు.  

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని