logo

త్రీ స్టార్‌ హోటల్‌ స్వాధీనానికి తాఖీదులు

రుణం ఎగవేతకు సంబంధించి రాజమహేంద్రవరంలోని ఓ త్రీ స్టార్‌ హోటల్‌కు డీఆర్‌టీ నోటీసులు జారీ చర్చనీయాంశమైంది. చెన్నై కేంద్రంగా ఉన్న హోటళ్ల నిర్వహణ సంస్థకు దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ ఆరేళ్ల క్రితం సుమారు రూ.110 కోట్ల రుణ

Published : 05 Dec 2021 06:26 IST

కంబాలచెరువు: రుణం ఎగవేతకు సంబంధించి రాజమహేంద్రవరంలోని ఓ త్రీ స్టార్‌ హోటల్‌కు డీఆర్‌టీ నోటీసులు జారీ చర్చనీయాంశమైంది. చెన్నై కేంద్రంగా ఉన్న హోటళ్ల నిర్వహణ సంస్థకు దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ ఆరేళ్ల క్రితం సుమారు రూ.110 కోట్ల రుణ సదుపాయం కల్పించింది. కొన్నాళ్లుగా వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ విశాఖలోని డీఆర్‌టీ (డెబిట్‌ రికవరీ ట్రైబ్యునల్‌)ను ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరంలోని ఆ హోటల్‌ స్వాధీన పరుచుకునేలా చూడాలని స్థానిక ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టుకు డీఆర్‌టీ సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఒకటో పట్టణ పోలీసులతో కలిసి శుక్రవారం కంపెనీ ప్రతినిధులు హోటల్‌కు వెళ్లారు. హోటల్‌ యాజమాన్యం వినతి మేరకు సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని