logo

తూర్పుతో ఆత్మీయానుబంధం

మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు తూర్పుతో విడదీయరాని అనుబంధం ఉంది. రోశయ్య తన కుమార్తెను కాకినాడకు చెందిన పైడా శేషగిరిరావు కుమారుడు ప్రసాద్‌కిచ్చి వివాహం చేసి వియ్యం అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి కాకినాడతో అనుబంధం ఏర్పడింది.

Published : 05 Dec 2021 06:26 IST


కిర్లంపూడి: 2016లో వాసవీమాత ఆలయంలో మాట్లాడుతున్న రోశయ్య

కాకినాడ బాలాజీచెరువు: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు తూర్పుతో విడదీయరాని అనుబంధం ఉంది. రోశయ్య తన కుమార్తెను కాకినాడకు చెందిన పైడా శేషగిరిరావు కుమారుడు ప్రసాద్‌కిచ్చి వివాహం చేసి వియ్యం అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి కాకినాడతో అనుబంధం ఏర్పడింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, మండపేటలో ఆర్యవైశ్య సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండోతరం కాంగ్రెస్‌ నాయకుల్లో మల్లిపూడి శ్రీరామసంజీవరావు, బత్తిన సుబ్బారావు, పంతం పద్మనాభం, మల్లాడి స్వామి వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. ఆపై తోట వెంకటాచలం, ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రామ్మోహనరావు, తోట సుబ్బారావు, ముత్తా గోపాలకృష్ణ, జీవీ హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, తోట నరసింహం, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడిపూడి చిట్టబ్బాయి, కుడిపూడి ప్రభాకరరావు వంటి నేతలతో కలిసి సాగారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం రోశయ్య శిష్యుడిగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు తండ్రి మల్లిపూడి శ్రీరామసంజీవరావుతో కలిసి రోశయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ఆయనతో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం ఉండేది. ్య రోశయ్య మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు వేర్వేరుగా సంతాపం తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు