logo

ఆన్‌లైన్‌లో వెయ్‌.. పందెం కాయ్‌..

కోడిపందేల బరుల వద్ద పందెంరాయుళ్లకు డబ్బు కొరత లేకుండా నిర్వాహకులు ఫోన్‌పే ఏర్పాట్లు చేశారు. అల్లవరం మండలం కోడూరుపాడు బరి వద్ద శుక్రవారం ఒక వ్యక్తి జూదరులకు నగదు కొరత లేకుండా చేసేందుకు ఫోన్‌పే ద్వారా నగదు ఖాతాలోకి జమ చేయించుకుని

Published : 15 Jan 2022 03:06 IST


అల్లవరం: కోడూరుపాడు కోడిపందేల బరులవద్ద ఏర్పాటు చేసిన ఫోన్‌పే కేంద్రం

అల్లవరం, న్యూస్‌టుడే: కోడిపందేల బరుల వద్ద పందెంరాయుళ్లకు డబ్బు కొరత లేకుండా నిర్వాహకులు ఫోన్‌పే ఏర్పాట్లు చేశారు. అల్లవరం మండలం కోడూరుపాడు బరి వద్ద శుక్రవారం ఒక వ్యక్తి జూదరులకు నగదు కొరత లేకుండా చేసేందుకు ఫోన్‌పే ద్వారా నగదు ఖాతాలోకి జమ చేయించుకుని కొంత మొత్తం కమిషన్‌ తీసుకుని నగదు చెల్లిస్తున్నారు. పండుగ సీజన్‌ కావడం, ఏటీఎంలలో నగదు కొరత ఉండటంతో డిజిటల్‌ యాప్‌ల ద్వారా బరుల వద్దే చెల్లింపులు చేస్తన్నారు. ఫోన్‌ నంబర్లు, స్కానింగ్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా జూదరులకు నగదు చెల్లించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని