logo

సారూ.. మీవాళ్లే ప్రోత్సహిస్తున్నారు

కోడిపందేలు, గుండాట, పేకాట, సింగం ఆటలకు అనుమతిచ్చి, ప్రోత్సహిస్తున్న అధికారులు సైతం నేరస్థులు అవుతారని సామాజిక కార్యకర్త సామాజిక, ఆర్టీఐ కార్యకర్త పి.వి.భద్రరావు అన్నారు. తాళ్లరేవు మండలంలోని

Published : 15 Jan 2022 03:06 IST

జూదాలపై ఎస్పీకి సామాజిక కార్యకర్త ఫిర్యాదు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కోడిపందేలు, గుండాట, పేకాట, సింగం ఆటలకు అనుమతిచ్చి, ప్రోత్సహిస్తున్న అధికారులు సైతం నేరస్థులు అవుతారని సామాజిక కార్యకర్త సామాజిక, ఆర్టీఐ కార్యకర్త పి.వి.భద్రరావు అన్నారు. తాళ్లరేవు మండలంలోని గాడిమొగ వెళ్లే సీతారామపురం శ్మశానవాటిక చెంత నిర్వహిస్తున్న కోడిపందేలు, గుండాట, పేకాట, సింగం ఆటలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశానన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులే, జూదాలకు పరోక్షంగా అనుమతిచ్చి, ప్రోత్సాహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీతారామపురం శ్మశానవాటిక పక్కన కోడిపందేలకు జిల్లా ఉన్నతాధికారుల అనుమతి ఉందని పోలీసులు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక్కడ నిర్వహించే జూదాలకు రూ.7.50 లక్షలకు వేలం పాట జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని