logo

పది తరాలు చెప్పుకొనేలా..

సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు భోగి పండగను పురస్కరించుకుని రూ.అయిదు లక్షలు విలువైన మొక్కలు శుక్రవారం నాటారు. గ్రామంలో కైలాసభూమికి వెళ్లే దారికి ఇరువైపులా మామిడి, పనస, నేరేడు, జామ తదితర 500కు పైగా

Published : 15 Jan 2022 03:06 IST


కైలాసభూమి వద్ద నాటుతున్న మామిడి మొక్కలు

సీతానగరం: సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు భోగి పండగను పురస్కరించుకుని రూ.అయిదు లక్షలు విలువైన మొక్కలు శుక్రవారం నాటారు. గ్రామంలో కైలాసభూమికి వెళ్లే దారికి ఇరువైపులా మామిడి, పనస, నేరేడు, జామ తదితర 500కు పైగా మొక్కలు నాటారు. వాటికి నీరు సరఫరా అయ్యేలా డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తిచేయించారు. పండగకు పదితరాలు గుర్తుండిపోయేలా, భవిష్యత్తు తరాల కోసం నాటినట్లు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని