logo

పీఆర్‌సీ నివేదిక ప్రతుల దహనం

పీఆర్‌సీకి సంబంధించి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రతులను భోగి మంటల్లో వేసి యూటీఎఫ్‌ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూటీఎఫ్‌ హోమ్‌ వద్ద నిరసన చేపట్టారు. ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ

Published : 15 Jan 2022 03:06 IST


నిరసనలో పాల్గొన్న యూటీఎఫ్‌ నాయకులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: పీఆర్‌సీకి సంబంధించి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రతులను భోగి మంటల్లో వేసి యూటీఎఫ్‌ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూటీఎఫ్‌ హోమ్‌ వద్ద నిరసన చేపట్టారు. ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ మాట్లాడుతూ పీఆర్‌సీపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆమోదించడంలేదన్నారు. ఫిట్‌మెంట్‌ ఐఆర్‌ కంటే ఎక్కువ ఉండాలన్నారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులను యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ఈ నెల 20న కలెక్టరేట్‌, 28న సచివాలయ ముట్టడికి కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పీవీఎన్‌ గణేశ్వరరావు, పి.రాజబాబు, సమ్మంగి శ్రీరాములు, కె.పెద్దిరాజు, జి.నాగేంద్ర, నాగప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని