logo

ఉద్యానాలకు ప్రత్యేక శోభ

ఆకర్షణీయ నగరం కాకినాడలో కొత్తగా ఆయుర్వేద (హెర్బల్‌), సీతాకోక చిలుకల ఉద్యానాలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కల్పించడానికి సైకిల్‌ ట్రాక్‌లు, ఉద్యాన వనాల సుందరీకరణ, వ్యాయామ సామగ్రిని

Published : 15 Jan 2022 03:06 IST


కాకినాడలోని సిద్ధార్థనగర్‌ ఉద్యానం

బాలాజీ చెరువు (కాకినాడ), న్యూస్‌టుడే: ఆకర్షణీయ నగరం కాకినాడలో కొత్తగా ఆయుర్వేద (హెర్బల్‌), సీతాకోక చిలుకల ఉద్యానాలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కల్పించడానికి సైకిల్‌ ట్రాక్‌లు, ఉద్యాన వనాల సుందరీకరణ, వ్యాయామ సామగ్రిని అందుబాటులోకి తెచ్చారు. కళాక్షేత్రం, సైన్స్‌ సెంటర్‌ రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తగా ఉద్యానాల ఏర్పాటుకు అనుమతి లభించడంతో కాకినాడ నగరం, గ్రామీణ మండలాల పరిధిలోని ఉద్యానాల్లో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 
ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే.. 
నగరపాలక సంస్థ పరిధిలోని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 1, 2, 3, 48, 49, 50 డివిజన్లతో నగర నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ తరహాల ఉద్యానాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే ఔషధ మొక్కలతో హెర్బల్‌ పార్కులను, సీతాకోక చిలుకల సంరక్షణ, పెంపకం తదితర యూనిట్లను ఏర్పాటుతో బటర్‌ఫ్లై పార్కులను తీర్చిదిద్దుతారు. త్వరలో డిజైన్లు రూపకల్పన చేయనున్నారు. 
అభివృద్ధి ఇలా..
నగరపాలక సంస్థ పరిధిలో ఆరు పెద్దవి, 20 వరకు చిన్న పార్కులు ఉన్నాయి. వీటిలో పెద్ద పార్కులను స్మార్ట్‌సిటీ నిధులతో సుందరంగా తీర్చిదిద్ది మిగతా వాటి గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయా చోట్ల హెర్బల్, బటర్‌ప్లై పార్కులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తొలుత 1, 2, 3 డివిజన్లలో సన్నాహాలు చేయనున్నారు. ఈ మూడు డివిజన్ల పరిధిలో లేఔట్లలో సామాజిక స్థలాలు అందుబాటులో ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 
త్వరలో ఆకృతులు సిద్ధం..
నగరంలో హెర్బల్, బటర్‌ఫ్లై పార్కుల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. త్వరలో వీటికి ఆకృతులు తయారు చేస్తారు. వీటి ఏర్పాటుకు సంబంధించి స్థలాలను పరిశీలించాం. లేఔట్‌ స్థలాలను కూడా ప్రతిపాదిస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే నగరానికి మరింత శోభ సంతరించుకోనుంది. - సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు, నగరపాలక సంస్థ, కాకినాడ


 విద్యుత్తు నగర్‌లో రూపురేఖలు మారనున్న పార్కు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని