logo

ఏటీఎంలో చోరీ యత్నం వ్యక్తి అరెస్టు

 స్థానిక ఇండియన్‌ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి కధనం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో మెయిన్‌ రోడ్డులో గల ఇండియన్‌

Published : 15 Jan 2022 03:06 IST

మండపేట, న్యూస్‌టుడే:  స్థానిక ఇండియన్‌ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి కధనం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో మెయిన్‌ రోడ్డులో గల ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో ఒక వ్యక్తి చోరీ యత్నానికి పాల్పడ్డాడు. ముందుగా సీసీ కెమెరా తీగలు కత్తిరించడంతో జోనల్‌ కార్యాలయంలో అలారం మోగి వెంటనే అధికారులు అప్రమత్తమై స్థానిక మేనేజరు కర్రి అనిల్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన ఏటీఎం వద్దకు చేరుకోగా చోరీ యత్నం చేసిన వ్యక్తి అక్కడ లేడు. దీంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజి ఆధారంగా చోరీ యత్నం చేసిన వ్యక్తి అంబటి ఇసాక్‌గా గుర్తించారు. శుక్రవారం నిందితుడిని అతనిని అరెస్టు చేశారు. ఏటీఎంకు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని మేనేజరు తెలిపారు. బ్యాంకు మేనేజరు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రమణారెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని