logo

ఇటుకబట్టీలో బంధించారు.. పోలీసులు విడిపించారు

మండలంలోని గోపాలపురంలోని ఇటుక బట్టీలో ఇబ్బందులు పడుతున్న పశ్చిమ్‌బంగాకు చెందిన కుటుంబ సభ్యులను పోలీసులు రక్షించారు. ఎస్సై భాను ప్రసాద్‌ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ్‌బంగాకు చెందిన తరికు గజీ కుటుంబ సభ్యులతో కలిసి గోపాలపురంలోని

Published : 15 Jan 2022 03:06 IST


ఇటుక బట్టీ నుంచి తీసుకుని వచ్చి పశ్చిమ్‌బంగాకు పంపిస్తున్న పోలీసులు

రావులపాలెం పట్టణం: మండలంలోని గోపాలపురంలోని ఇటుక బట్టీలో ఇబ్బందులు పడుతున్న పశ్చిమ్‌బంగాకు చెందిన కుటుంబ సభ్యులను పోలీసులు రక్షించారు. ఎస్సై భాను ప్రసాద్‌ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ్‌బంగాకు చెందిన తరికు గజీ కుటుంబ సభ్యులతో కలిసి గోపాలపురంలోని ఇటుక బట్టీలో పనిచేసేందుకు రెండు నెలల క్రితం వచ్చారు. కొంత కాలంగా ఇటుక బట్టీ యజమాని నాగరాజు వారిని ఇబ్బందులకు గురిచేస్తూ బంధించాడన్నారు. వీరు పశ్చిమ్‌బంగాలోని బంధువులకు విషయాన్ని తెలపగా వారు ఇక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమస్యలను వివరించడంతో ఎస్పీ ఆదేశాల మేరకు రావులపాలెం పోలీసులు గోపాలపురం వెళ్లి వారిని బట్టీ నుంచి తీసుకుని వచ్చి సొంతూరు పంపించినట్టు ఎస్సై 
తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని