logo

తాపేశ్వరంలో భారీ చోరీ

తాపేశ్వరానికి చెందిన పుల్లకవి భాస్కరరావు పురోహితునిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 29న భార్యకు అనారోగ్యంగా ఉండటంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సచేయిస్తున్నారు.

Published : 17 Jan 2022 05:07 IST

మండపేట గ్రామీణం: తాపేశ్వరానికి చెందిన పుల్లకవి భాస్కరరావు పురోహితునిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 29న భార్యకు అనారోగ్యంగా ఉండటంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సచేయిస్తున్నారు. ఆయన కూడా ఆమెతోపాటే ఉంటున్నారు. ఇంటిని చూసుకోమని శిష్యుడు బొగ్గవరపు సూరిబాబుకు చెప్పారు. శనివారం ఉదయం అతనొచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి, కాకినాడ నుంచి వచ్చిన క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.11లక్షలు విలువైన బంగారం, రూ.లక్ష విలువైన వెండి పోయాయని భాస్కరావు కుమారుడు శ్రీనివాస్‌ తెలిపారని, మరోచోట కూడా చోరీకి యత్నించారని ఎస్సై శివకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శివగణేష్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని