logo

సీ ఫుడ్స్‌ పేరిట గంజాయి తరలింపు

జాతీయ రహదారిపై దివాన్‌చెరువు వద్ద రూ.21 లక్షల విలువైన 420 కేజీల గంజాయిని బొమ్మూరు పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కుచెందిన మహారాజ్‌ రాజేంద్రన్‌, స్టార్‌విన్‌ మరియదాస్‌,

Published : 17 Jan 2022 05:07 IST


పోలీసుల అదుపులో నిందితులు

రాజానగరం: జాతీయ రహదారిపై దివాన్‌చెరువు వద్ద రూ.21 లక్షల విలువైన 420 కేజీల గంజాయిని బొమ్మూరు పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కుచెందిన మహారాజ్‌ రాజేంద్రన్‌, స్టార్‌విన్‌ మరియదాస్‌, వినోద్‌కుమార్‌ మణికందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ రమాదేవి, బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి సమక్షంలో వారిని విచారించారు. 13 బస్తాల్లో గంజాయిని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు సీఫుడ్స్‌కు వినియోగించే వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుబడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని