logo

కాలు దువ్విన కోడి.. చేతులు మారిన రూ.కోట్లు

పోలీసుహెచ్చరికలను బేఖాతర్‌చేస్తూ కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కోడిపందేలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి. పి.గన్నవరం, పోతవరం, ఊడిమూడి, వాడ్రేవుపల్లి, మానేపల్లి తదితర గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. మలికిపురం మండలంలోని

Published : 17 Jan 2022 05:07 IST


పి.గన్నవరంలో గుండాట 

న్యూస్‌టుడే బృందం: పోలీసుహెచ్చరికలను బేఖాతర్‌చేస్తూ కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కోడిపందేలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి. పి.గన్నవరం, పోతవరం, ఊడిమూడి, వాడ్రేవుపల్లి, మానేపల్లి తదితర గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. మలికిపురం మండలంలోని మలికిపురం, మేడిచర్లపాలెం, గుడిమెళ్లంక, లక్కవరం గూడపల్లి, తూర్పుపాలెం, కేశనపల్లి, కత్తిమండ గ్రామాల్లో కోడి పందేలు, గుండాటలు శని, ఆదివారాల్లో యథేచ్ఛగా కొనసాగాయి.రికార్డింగ్‌ డ్యాన్సులకు వచ్చిన ఎనిమిది మంది యువతులను తూర్పుపాలెంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై హరికోటి శాస్త్రి చెప్పారు. మామిడికుదురు  మండలంలోని అప్పనపల్లి, పాశర్లపూడి, ఆదుర్రు, మాకనపాలెం, లూటుకుర్రు, పెదపట్నం, గోగన్నమఠం, మగటపల్లి, కరవాక, అంబాజీపేట మండలంలోని  పోతాయిలంక, రావులమ్మపానాటం, ముక్కామల,  అయినవిల్లి మండలంలోని సిరిపల్లి, విలస గ్రామాల్లో కోడిపందెలు సాగాయి.  సఖినేటిపల్లి మండలంలో కోడి పందేలు ఆడుతున్న 13 మందిపై ఎస్సై ఫణికుమార్‌ కేసులు నమోదు చేశారు. ఆత్రేయపురం మండలం  పేరవరం, లొల్ల, ర్యాలి, మెర్లపాలెం, పేరవరం గ్రామాల్లోని బరుల్లో జరిగిన పందేలకు మండల ప్రజలే కాకుండా ఉభయగోదావరి తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. సుమారు రూ.3 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం.  పేరవరం అడ్డగట్టు సమీపంలోని బొబ్బర్లంక రోడ్డు చెంతన పందేలకు వచ్చిన వారు వాహనాలు ఎక్కడికక్కడే ఉంచేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 
ఆలమూరు: ఆలమూరు మండలంలో కోడిపందేలు జోరుగా సాగాయి. మడికి, చొప్పెల్ల, జొన్నాడ, చింతలూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో పందెంకోళ్లు తలపడ్డాయి. నిర్వాహకులు కోడిపందేల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారులెవరూ అటు వైపు తొంగిచూడకపోవడంతో నిర్వాహకులు గుండాట, పేకాట తదితర కార్యక్రమాలతో హల్‌చల్‌ చేశారు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది. రాజోలు, శివకోటి, తాటిపాక, చింతలపల్లి, బి.సావరం, పొన్నమండ, పొదలాడ, సోంపల్లి, కడలి గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. 


పల్లిపాలెంలో కోడి పందేలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని