logo

తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వే జిల్లా మీదుగా ఈ నెలాఖరు వరకు ఆయా తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. తిరుగు ప్రయాణాల దృష్ట్యా

Published : 17 Jan 2022 05:07 IST


రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండులో రద్దీ

వి.ఎల్‌.పురం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వే జిల్లా మీదుగా ఈ నెలాఖరు వరకు ఆయా తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. తిరుగు ప్రయాణాల దృష్ట్యా ఇప్పటికే జిల్లా ఆర్టీసీ ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు 150 వరకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆదివారం వివిధ డిపోల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర దూరప్రాంతాలకు 72 సర్వీసులు నడిచాయి. వీటిలో హైదరాబాద్‌కు 28, విశాఖకు 26, విజయవాడకు 16 బస్సులు, ఇతర దూరప్రాంతాలకు మరో రెండు ప్రత్యేక బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 17, 18 తేదీల్లో జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం 28 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ను బట్టి వీటిని పెంచుకుంటూ వెళ్తామని, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు, అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇటు రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆదివారం జిల్లామీదుగా లింగంపల్లి-కాకినాడ(07492), అగర్తలా-సికింద్రాబాద్‌(07029), విశాఖపట్నం-ఎలహంకా (08577), కాకినాడ-సికింద్రాబాద్‌(82727), అనకాపల్లి-సికింద్రాబాద్‌(07436) ప్రత్యేక రైళ్లు నడిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని