logo

Crime News: శ్మశానంలో కోడిపందేలు.. వ్యక్తి మృతితో ‘బరి’మార్పు

కోడిపందేలు నిర్వహించాలనుకున్నారు. స్థలం దొరకలేదు. దాంతో శ్మశానంలో ఏర్పాటు చేశారు. తీరా.. గ్రామంలో ఓ వ్యక్తి మృతిచెందడంతో పందేల బరిని మార్చాల్సివచ్చిన ఉదంతమిది. వివరాల్లోకి వెళ్తే.. యు.కొత్తపల్లి

Updated : 17 Jan 2022 10:21 IST

కొమరగిరి(కొత్తపల్లి), న్యూస్‌టుడే: కోడిపందేలు నిర్వహించాలనుకున్నారు. స్థలం దొరకలేదు. దాంతో శ్మశానంలో ఏర్పాటు చేశారు. తీరా.. గ్రామంలో ఓ వ్యక్తి మృతిచెందడంతో పందేల బరిని మార్చాల్సివచ్చిన ఉదంతమిది. వివరాల్లోకి వెళ్తే.. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో స్థానిక నాయకుల అండతో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన ఒకరు చనిపోయారని తెలియడంతో చేసేదిలేక మరోచోటకు పందేలను మర్చారు. ఆ తరువాత మృతుని కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇదిలా ఉండగా.. పందేలకోసమని శ్మశానం అనుకుని ఉన్న ఆరు సామూహిక మరుగుదొడ్లను కూల్చివేయడంపై శుక్రవారం సర్పంచి నిలదీయడంతో పందేల నిర్వహణ చర్చనీయాంశమైంది. స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని