logo

ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

భార్య వేరే వ్యక్తితో కలిసిఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త విషం తాగి, పిల్లలకూ తాగించిన కేసు మరో మలుపు తిరిగింది. వంగలపూడిలో ఈ నెల 15న ఘటనలో తండ్రీకొడుకులు అపస్మారస్థితికి చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో కోలుకున్న బాధితుడు సోమవారం

Published : 18 Jan 2022 04:20 IST

వీడియో కలకలం.. మరో మలుపు

సీతానగరం: భార్య వేరే వ్యక్తితో కలిసిఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త విషం తాగి, పిల్లలకూ తాగించిన కేసు మరో మలుపు తిరిగింది. వంగలపూడిలో ఈ నెల 15న ఘటనలో తండ్రీకొడుకులు అపస్మారస్థితికి చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో కోలుకున్న బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్‌.లక్ష్మణరావు విదేశాల్లో ఉన్న తన భార్యను తరచూ జిల్లాకు రప్పించి వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని, ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లోనూ పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో కలతచెంది తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, పిల్లలు ఎలా బతుకుతారోననే ఆందోళనతో వాళ్లతోనూ విషరసాయనం తాగించే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదుచేసి కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌రావు ప్రమేయంపై విచారణ ప్రారంభించామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. దృశ్యాల పరిశీలనకు ఐటీ యాక్ట్‌ అమలు చేస్తున్నామన్నారు. నిర్ధారణ పూర్తయితే కువైట్‌లో ఉన్న ఆ మహిళను విచారించడంతోపాటు కానిస్టేబుల్‌పై చర్యలు ఉంటాయన్నారు.

కువైట్‌లో ఆత్మహత్యాయత్నం..

అసభ్యకర దృశ్యాలపై బంధువుల నుంచి కువైట్‌లో ఉన్న మహిళకు సమాచారం చేరింది. దాంతో అతిగా మందుబిళ్లలు మింగి ఆమె అపస్మారస్థితికి చేరినట్లు వీడియోకాల్‌లో చూసిన తర్వాతే ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ తండ్రీకొడుకులకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని