logo

బాణసంచా పేలుళ్లపై విచారణ పూర్తి: ఇద్దరికి జైలు

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 18మంది కూలీలు చనిపోయిన కేసులో ఇద్దరికి అయిదేళ్ల జైలుశిక్ష ఖరారైంది. కొత్తపల్లి ఎస్సై అబ్దుల్‌నబీ వివరాల మేరకు.. 2014 అక్టోబరులో యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా కేంద్రంలో పేలుళ్లు సంభవించి 18 మంది కార్మికులు మృతిచెందారు. అప్పటి తహసీల్దారు

Published : 18 Jan 2022 04:20 IST

కొత్తపల్లి: బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 18మంది కూలీలు చనిపోయిన కేసులో ఇద్దరికి అయిదేళ్ల జైలుశిక్ష ఖరారైంది. కొత్తపల్లి ఎస్సై అబ్దుల్‌నబీ వివరాల మేరకు.. 2014 అక్టోబరులో యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా కేంద్రంలో పేలుళ్లు సంభవించి 18 మంది కార్మికులు మృతిచెందారు. అప్పటి తహసీల్దారు పినిపే సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదైంది. డీఎస్పీ వెంకటేశ్వరరావు దర్యాప్తుచేసి కోర్టుకు నివేదిక సమర్పించారు. నేరం రుజువు కావడంతో నిర్వాహకులు కొప్పిశెట్టి అప్పారావు, కొప్పిశెట్టి వరప్రసాద్‌కు అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తూ పిఠాపురం అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవి సోమవారం తీర్పు వెల్లడించారు. కేసును ఏపీపీ కిరణ్‌ వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని