logo

స్పందనకు తగ్గినఅర్జీలు

సంక్రాంతి నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు తగ్గాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి 150 మంది వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్‌ సి.హరికిరణ్‌

Published : 18 Jan 2022 04:20 IST


సమస్యలు వింటున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సంక్రాంతి నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు తగ్గాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి 150 మంది వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్‌ సి.హరికిరణ్‌, సంయుక్త కలెక్టర్లు సుమిత్‌ కుమార్‌, కీర్తి, భార్గవ్‌తేజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ వినతులు స్వీకరించారు. స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, రోజువారీ కేసుల వివరాలు, హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేయించాలని ఆదేశించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఏఎస్పీ కరణం కుమార్‌

మసీదు సెంటర్‌ (కాకినాడ): జిల్లా పోలీసు కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ స్పందన కార్యక్రమాన్ని ఏఎస్పీ కుమార్‌ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు 30 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. సివిల్‌ వివాదాలు-9, కుటుంబ తగాదాలు-7, ఇతర సమస్యలు-14 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని