logo

31 వరకు రాత్రి కర్ఫ్యూ

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

Published : 18 Jan 2022 04:20 IST

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

అత్యవసర సేవలకు మినహాయింపు: ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఫార్మసీలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌ కాస్టింగ్‌ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు మినహా మిగతా అన్ని సంస్థలు కర్ఫ్యూ వేళల్లో విధిగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి: వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను తగిన గుర్తింపు కార్డుతో అనుమతిస్తారని తెలిపారు.

ఆధారాలు ఉండాల్సిందే: రైల్వేస్టేషన్‌, బస్టాండు, విమానాశ్రయ ప్రయాణికులు విధిగా సంబంధిత ఆధారాలు చూపాలన్నారు. ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని జిల్లాల మధ్య సరకుల రవాణాకు అనుమతి ఉందని తెలిపారు. కొవిడ్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని