logo

గౌరమ్మ సారె... కనులపండువగా సాగె..

కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో గౌరీ శంకరుల రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఏటా సంక్రాంతి తరువాత గ్రామంలో రథోత్సవం జరగడం ఇక్కడి విశేషం. అలంకరించిన రథంపై గౌరీ శంకరుల విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. గ్రామస్థులు వివిధ రకాల వేషధారణలతో

Published : 18 Jan 2022 04:20 IST


రథంపై గౌరీ శంకరుల విగ్రహాలు

కోరుకొండ: కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో గౌరీ శంకరుల రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఏటా సంక్రాంతి తరువాత గ్రామంలో రథోత్సవం జరగడం ఇక్కడి విశేషం. అలంకరించిన రథంపై గౌరీ శంకరుల విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. గ్రామస్థులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. రథోత్సవం ప్రారంభానికి ముందు వీరభద్రుల సంబరం జరిపించారు. ఆ తరువాత ఆడపడుచులు, కోడళ్లు పెద్ద సంఖ్యలో వివిధ రకాల స్వీట్లు, పండ్లు పట్టుకుని అమ్మవారికి సారె సమర్పించారు. కనులపండువగా సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని