logo

500 ఎకో క్లబ్‌లకు నిధులు

 జిల్లాలోని 500 పాఠశాలల్లో నడుస్తున్న ఎకో క్లబ్‌ల నిర్వహణకు రూ.25 లక్షలు మంజూరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి సలాంటి అబ్రహం వెల్లడించారు. ఒక్కో క్లబ్‌కు రూ.5000 చొప్పున వచ్చాయన్నారు. ఇందులో రూ.2000 నీలం, ఆకుపచ్చ చెత్త బుట్టల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. దీని నిమిత్తం రాష్ట్రవ్యాప్త టెండరు

Published : 18 Jan 2022 04:20 IST

పామర్రు, న్యూస్‌టుడే: జిల్లాలోని 500 పాఠశాలల్లో నడుస్తున్న ఎకో క్లబ్‌ల నిర్వహణకు రూ.25 లక్షలు మంజూరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి సలాంటి అబ్రహం వెల్లడించారు. ఒక్కో క్లబ్‌కు రూ.5000 చొప్పున వచ్చాయన్నారు. ఇందులో రూ.2000 నీలం, ఆకుపచ్చ చెత్త బుట్టల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. దీని నిమిత్తం రాష్ట్రవ్యాప్త టెండరు ద్వారా ఖరారైన సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ బుట్టలను ఆయా పాఠశాలల వారు సంబంధిత విద్యాశాఖ డివిజన్‌ కేంద్రాల్లో తీసుకోవాలని చెప్పారు. మిగిలిన వాటిలో రూ.500ను బ్యానర్‌ రాయించడానికి, మరో రూ.2,500ను పర్యావరణ దినోత్సవాల నిర్వహణ, ఆవరణలో మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారమే ప్రధానోపాధ్యాయులు సంబంధిత మొత్తాన్ని ఖర్చు చేయాలని జిల్లా గ్రీన్‌కోర్‌(పచ్చదళం) సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని