logo

ఆకలి తీర్చారు.. అక్కున చేర్చారు..

రంగంపేట మండలం కోటపాడులో ఏడీబీ రోడ్డు పక్కన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మతిస్థిమితం లేని వృద్ధుడ్ని హైవే మొబైల్‌ ఉద్యోగి కరీమ్‌ సోమవారం మధ్యాహ్నం చూశారు. అతన్ని అడుగగా.. తన పేరు పిల్లి సుబ్బారావు అని, తమది గోకవరం కొత్తపల్లిని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న అతనికి కరీమ్‌తోపాటు కోటపాడు వీఆర్వో

Published : 18 Jan 2022 04:29 IST

రంగంపేట మండలం కోటపాడులో ఏడీబీ రోడ్డు పక్కన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మతిస్థిమితం లేని వృద్ధుడ్ని హైవే మొబైల్‌ ఉద్యోగి కరీమ్‌ సోమవారం మధ్యాహ్నం చూశారు. అతన్ని అడుగగా.. తన పేరు పిల్లి సుబ్బారావు అని, తమది గోకవరం కొత్తపల్లిని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న అతనికి కరీమ్‌తోపాటు కోటపాడు వీఆర్వో దొరబాబు, స్థానికులు గవరసాని రాజు, చంద్రశేఖర్‌, వలంటీర్లు కీర్తి, దుర్గాప్రసాద్‌ ఆహారం అందించి సమీపంలోని షెల్టరులోకి తరలించారు. వృద్ధుని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉండడంతో వారికి సమాచారం అందించారు. మంగళవారం వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. వీరి చొరవను అంతా మెచ్చుకున్నారు.

- న్యూస్‌టుడే, రంగంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని