logo

ధ్రువపత్రాల పరిశీలన

డీఈఈసెట్‌ 2021లో సీీటు పొందిన అభ్యర్థులకు మొదటిరోజు సోమవారం బొమ్మూరు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. వంద మంది అభ్యర్థులు పరిశీలనకు హాజరు కాగా, వారిలో 89 మందికి అర్హత పత్రాలు అందించామని కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌ఆర్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Published : 18 Jan 2022 04:29 IST

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: డీఈఈసెట్‌ 2021లో సీీటు పొందిన అభ్యర్థులకు మొదటిరోజు సోమవారం బొమ్మూరు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. వంద మంది అభ్యర్థులు పరిశీలనకు హాజరు కాగా, వారిలో 89 మందికి అర్హత పత్రాలు అందించామని కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌ఆర్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారికి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, జీబీఆర్‌ అనపర్తి, మోహన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూఫట్‌ కాకినాడ, ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ బొమ్మూరు, ఐటీడీఏ రంపచోడవరంలోని కళాశాలలను కేటాయించామన్నారు. ధ్రువపత్రాల పరిశీలకులుగా అధ్యాపకులు రాముడు, ఎఎస్‌ఎల్‌ శర్మ వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని