logo

పేలుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పేలుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ధవళేశ్వరం సీీఐ అడబాల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం...

Published : 20 Jan 2022 05:42 IST

ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పేలుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ధవళేశ్వరం సీీఐ అడబాల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని నామవరం గ్రామానికి చెందిన ఓ బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం రాత్రి మేనమామ జగన్నాథరావు బాలికను, ఆమె చెల్లిని పాఠశాల వసతి గృహంలో దించి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత... బాలిక చెల్లి వసతి గృహం వార్డెన్‌ విజయలక్ష్మీదేవి వద్దకు వెళ్లింది. అక్కకు హాస్టల్‌కు రావడం ఇష్టం లేదని, అమ్మ బలవంతంగా పంపడంతో ఆ కోపంతో మనస్థాపం చెంది పేలుమందు మూడు ప్యాకెట్లు తాగిందని చెప్పింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలికను హాస్టల్‌ వార్డెన్‌ చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. వార్డెన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని