logo

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

రౌతులపూడి మండలంలోని ఉపప్రణాళికా ప్రాంతంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య బుధవారం పర్యటించారు. మొదటిసారి ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. జల్ధాం, రాఘవపట్నంల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. జల్ధాంలో జరిగిన సభలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Published : 20 Jan 2022 05:42 IST


 రాఘవపట్నంలో మహిళ గోడు వింటున్న పీవో

రౌతులపూడి, న్యూస్‌టుడే: రౌతులపూడి మండలంలోని ఉపప్రణాళికా ప్రాంతంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య బుధవారం పర్యటించారు. మొదటిసారి ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. జల్ధాం, రాఘవపట్నంల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. జల్ధాంలో జరిగిన సభలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాఘవపట్నం ఆశ్రమపాఠశాలలో హాజరుశాతం తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండపోడులు సాగుచేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలన్నారు. దరఖాస్తుదారులకు ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందాలన్నారు. చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. బైక్‌ అంబులెన్సు ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. ఉపప్రణాళికాలోని గ్రామాలను షెడ్యూలు ప్రాంతంలో విలీనం అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. లేటరైట్‌ లారీలు తిరగడంతో రహదారి ధ్వంసమైందని, పెదమల్లాపురం, ముకులూరు చేరుకునే మార్గాలను ఏర్పాటుచేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో ఎస్వీనాయుడు, ఐసీడీఎస్‌ సీడీపీవో సుగుణవతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
పూర్తిస్థాయిలో సౌకర్యాలు..
శంఖవరం: శంఖవరం మండలంలోని ఉపప్రణాళికా ప్రాంతమైన పెదమల్లాపురంలో బుధవారం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య పర్యటించారు. ఆసుపత్రి, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. కులధృవీకరణ పత్రాల మంజూరు, పాఠశాల, అంగన్‌వాడీల్లో ఇబ్బందులను సర్పంచి నాగదేవి, స్థానికులు ఆయనకు వివరించారు. ఎంపీడీవో జె.రాంబాబు, బాధ్య తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంఈవో రమణ తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని