logo

అంతర్వేది ఆలయ హుండీ ఆదాయం రూ.46.33 లక్షలు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి హుండీల ఆదాయం రూ.46.33లక్షలు వచ్చినట్లు ఆలయ ఏసీ భద్రాజీ బుధవారం వెల్లడించారు. 105 రోజుల నుంచి భక్తులు సమర్పించిన మొక్కులను అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం ఏసీ బాబూరావు, జడ్పీటీసీ అన్నపూర్ణ సమక్షంలో

Published : 20 Jan 2022 05:42 IST


కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి హుండీల ఆదాయం రూ.46.33లక్షలు వచ్చినట్లు ఆలయ ఏసీ భద్రాజీ బుధవారం వెల్లడించారు. 105 రోజుల నుంచి భక్తులు సమర్పించిన మొక్కులను అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం ఏసీ బాబూరావు, జడ్పీటీసీ అన్నపూర్ణ సమక్షంలో హుండీలను తెరిచి సిబ్బంది లెక్కించగా రూ.46.33 లక్షల వచ్చిందని పేర్కొన్నారు. అలాగే క్షేత్రపాలకుడు పార్వతీ నీలకంఠేశ్వరస్వామి హుండీ ద్వారా రూ.36,367 సమకూరిందన్నారు. స్వామివారి ఉత్సవాలకు సంబందించి నేడు వివిధ శాఖల అధికారులతో అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు భైరా నాగరాజు, పలు దేవస్థానాల ఈవోలు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని