logo

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నేడు

పీఆర్‌సీ ఉత్తర్వులను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు

Published : 20 Jan 2022 05:42 IST

కాకినాడ నగరం: పీఆర్‌సీ ఉత్తర్వులను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కమిటీ ఛైర్మన్‌ చెవ్వూరి రవి తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 
పెన్షనర్ల ఆధ్వర్యంలో..
గాంధీనగర్‌: పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌పై పునరాలోచించాలని, ఇంటి అద్దె స్లాబులు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సత్తిరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.హెచ్‌.మోహనరావు, సత్యనారాయణరాజు తెలిపారు.  వారు మాట్లాడుతూ, పెరిగిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ లబ్ధిని జనవరి 2022 నుంచి మాత్రమే అమలు చేస్తామని ప్రకటించడం పెన్షనర్లను ఆందోళనకు గుర్తి చేస్తోందన్నారు. గురువారం ఆందోళనలో ఆల్‌ పెన్షనర్స్ , రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్ల సభ్యులు పాల్గొని మద్దతు తెలపాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని