logo

వెంటాడే భయం.. వెన్నంటే అభయం

పండగ తర్వాత కొవిడ్‌ కేసులు పెరుగుతాయనే  అంచనాలు నిజమయ్యాయి. రాకపోకలు పెరగడం..  కొందరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో మహమ్మారి దూకుడు పెరిగింది. పదుల నుంచి వందల సంఖ్యకు చేరడం కలవరపెడుతోంది. పరిస్థితి

Published : 20 Jan 2022 05:42 IST

 అమాంతం పెరిగిన పాజిటివిటీ రేటు 
 24 గంటల్లో.. 919 మందికి వైరస్‌

ఈనాడు - కాకినాడ పండగ తర్వాత కొవిడ్‌ కేసులు పెరుగుతాయనే  అంచనాలు నిజమయ్యాయి. రాకపోకలు పెరగడం..  కొందరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో మహమ్మారి దూకుడు పెరిగింది. పదుల నుంచి వందల సంఖ్యకు చేరడం కలవరపెడుతోంది. పరిస్థితి ముందే ఊహించిన యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.. అనుమానిత కేసులు గుర్తించడం.. వారికి పరీక్షలు.. వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్‌-19 నిబంధనలు సమర్థంగా పాటించడం.. టీకాలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి భరోసా దక్కినట్లేనని వైద్య
నిపుణులు చెబుతున్నారు.

కేసులు పైపైకి..
పాజిటివ్‌ కేసుల తీవ్రత వారం రోజులుగా భారీగా పెరిగింది. నవంబరులో పాజిటివ్‌ రేటు 1.21 శాతం ఉంటే.. డిసెంబరులో 0.61 శాతానికి తగ్గింది.. జనవరి ప్రథమాంకంలో 5.86 శాతానికి పెరిగితే.. ఈ వారం ఏకంగా 13 శాతానికి  చేరింది. తాజాగా 36.76 శాతం చేరింది. కొవిడ్‌కుతోడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులూ వెంటాడుతున్నాయి. కొందరి నిర్లక్ష్యమే పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం 3,343 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

లక్షణాలు మారాయి..
డెల్టా, డెల్టాప్లస్‌ లక్షణాలతోపాటు ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా లక్షణాలతోపాటు జలుబు, దగ్గు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.  ప్రతి ఒక్కరూ మాస్కు, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం జాగ్రత్తలు తీసుకోవాలి.
- కిరణ్, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు, జీజీహెచ్‌


సమర్థ సేవలకు సన్నాహాలు
కొవిడ్‌ వేళ 6,132 పడకలు సిద్ధం చేశాం. బొమ్మూరు, బోడసకుర్రు, జేఎన్టీయూ, కాకినాడ తితిదే కల్యాణ మండపంలోనూ పడకలు ఉంచుతున్నాం. హోమ్‌ ఐసొలేషన్‌ కోసం 60 వేల కిట్లు సిద్ధంచేశాం. రోజూ టెలీ కన్సల్టేషన్‌ ద్వారా ప్రతి రోగి ఆరోగ్యస్థితి తెలుసుకుని కిట్లు అందిస్తున్నాం. రోజుకు 2,500 పరీక్షలు చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో ల్యాబ్‌ సిద్ధమైంది. అమలాపురంలో అందుబాటులోకి తెస్తాం. 
- సి.హరికిరణ్, కలెక్టర్‌

 తీవ్రత ఇక్కడే టాప్‌-10
* రాజమహేంద్రవరం గ్రామీణం * కూనవరం * రాజమహేంద్రవరం నగరం * కాకినాడ గ్రామీణం * ఎటపాక * చింతూరు * గోకవరం * రాజానగరం * కాకినాడ నగరం * అమలాపురం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని