logo

ఆర్టీసీకి సంక్రాంతి

 సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల ద్వారా జిల్లా ఆర్టీసీకి రూ.1,16,20,008 అదనపు రాబడి సమకూరింది. షెడ్యూల్‌ బస్సు సర్వీసు ద్వారా జిల్లా ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.1.05 కోట్ల వరకు వస్తుంది. పండగ రద్దీ దృష్ట్యా ఈ నెల 7 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ

Published : 21 Jan 2022 04:42 IST

 

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల ద్వారా జిల్లా ఆర్టీసీకి రూ.1,16,20,008 అదనపు రాబడి సమకూరింది. షెడ్యూల్‌ బస్సు సర్వీసు ద్వారా జిల్లా ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.1.05 కోట్ల వరకు వస్తుంది. పండగ రద్దీ దృష్ట్యా ఈ నెల 7 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం తదితర దూరప్రాంతాలకు మొత్తం 466 ప్రత్యేక బస్సులను 3,02,991 కిలోమీటర్ల మేర తిప్పారు.

హైదరాబాద్‌కు నాలుగు... జిల్లాలోని ఆయా డిపోల నుంచి ప్రతిరోజూ హైదరాబాద్‌కు 28 షెడ్యూల్‌ బస్సులు నడుస్తున్నాయి. కాగా గురువారం హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో నాలుగు బస్సులు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీటీఎం వరప్రసాద్‌ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, ఏలేశ్వరం డిపోల నుంచి ఒక్కొక్కటి చొప్పున అదనపు సర్వీసులను హైదరాబాద్‌కు నడిపినట్లు చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని