logo

హోంగార్డుల కుటుంబాలకు సహకారం

 హోంగార్డుల సంక్షేమం కోసం గురువారం ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధ్యక్షతన దర్బారు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎంఎస్‌రెడ్డి కుటుంబానికి మంజూరైన రూ.30 లక్షల చెక్కు, జిల్లా హోంగార్డుల ఒకరోజు జీతం రూ.2,10,160 చెక్కులను అతడి భార్య సత్యవేణికి ఎస్పీ అందజేశారు.విద్యలో

Published : 21 Jan 2022 04:42 IST


చెక్కు అందజేస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

మసీదుసెంటర్‌: హోంగార్డుల సంక్షేమం కోసం గురువారం ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధ్యక్షతన దర్బారు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎంఎస్‌రెడ్డి కుటుంబానికి మంజూరైన రూ.30 లక్షల చెక్కు, జిల్లా హోంగార్డుల ఒకరోజు జీతం రూ.2,10,160 చెక్కులను అతడి భార్య సత్యవేణికి ఎస్పీ అందజేశారు.విద్యలో ప్రతిభ చాటిన 19 మంది హోంగార్డుల పిల్లలకు రూ.35 వేలు ఉపకార వేతనాలు అందించారు.ఎస్బీ డీఎస్పీ అంబికాప్రసాద్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామచంద్రరావు, పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకోటేశ్వరరావు, ఎస్బీ సీఐ రమణ, హోంగార్డ్‌ ఆర్‌ఐ శ్రీహరిరావు పాల్గొన్నారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సూచించారు. జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందితో గురువారం ఆన్‌లైన్‌లో సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ, కొవిడ్‌ బాధిత సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామనీ, ధైర్యంగా ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని