logo

లోకకల్యాణానికి కోటి తులసి పూజ

లోక కల్యాణార్థం అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు కోటి తులసి పూజ నిర్వహించడానికి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈవో వి.త్రినాథరావు, సభ్యులు పలు

Published : 21 Jan 2022 04:42 IST


ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చిస్తున్న ఛైర్మన్‌, ఈవో, సభ్యులు

అన్నవరం: లోక కల్యాణార్థం అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు కోటి తులసి పూజ నిర్వహించడానికి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈవో వి.త్రినాథరావు, సభ్యులు పలు అంశాలపై చర్చించారు.

ఇవీ తీర్మానాలు.. ప్రసాదం ప్యాకర్లకు ప్యాకెట్టు ఒక్కింటికి ఇచ్చే కమీషన్‌ రూ.0.70 నుంచి రూ.1.10కి పెంచడానికి ఆమోదించారు. సత్యదేవుని వార్షిక కల్యాణానికి రూ.3.5 లక్షలతో విద్యుత్తు అలంకరణ, రూ.6.3 లక్షలతో ఇతర పనుల నిర్వహణ. రూ.5 లక్షలతో గెద్దనాపల్లి వేణుగోపాల ఆలయంలో, రూ.2.15 లక్షలతో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రంగులు వేయడానికి నిర్ణయించారు. దేవస్థానంలో ఖాళీగా ఉన్న ధార్మిక పోస్టుల భర్తీ, డిగ్రీ కళాశాలలో 9 మంది అధ్యాపకులకు గంటల పద్ధతిలో రెమ్యునరేషన్‌ చెల్లింపు, ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు జరిగే వివాహ శుభ కార్యాల్లో విష్ణుసదన్‌, ఉచిత కల్యాణ వేదిక శుభ్రం చేసేందుకు టెండర్‌ ద్వారా సిబ్బంది ఏర్పాటుకు నిర్ణయం. ఆప్కో వస్త్రదుకాణం అద్దెను రూ.2 వేలు నుంచి రూ.2,500కు పెంపు, గెద్దనాపల్లి వేణుగోపాల స్వామి సిబ్బంది జీతాల పెంపు.

ఇతర అంశాలు..

రోలుగుంటలో సత్యనారాయణస్వామి ఆలయాన్ని దత్తత తీసుకోవాలని చోడవరం ఎమ్మెల్యే విజ్ఞప్తిపై చర్చించి దేవస్థానానికి భారమవుతుందని తిరస్కరించారు. ప్రసాదం తయారీకి ఇత్తడి కళాయిలకు మరోసారి టెండర్లు పిలవాలని సభ్యులు సూచించారు. వ్రతాలకు తమలపాకులు వంద ఆకులు రూ.11.45కు టెండర్లకు ఆమోదం తెలిపారు. స్వామివారికి వజ్ర కిరీటం తయారీకి దాత బొడ్డు వెంకటరమణ కృషిని అందరూ అభినందించారు.

స్వల్ప వివాదం..

శంఖవరం మండలం గొందిలోని 34.73 ఎకరాల మాన్యంలో జామాయిల్‌ మోళ్లు తీసి, కర్ర తీసుకెళ్లి, భూమి చదునుపై చర్చ జరిగింది. వేలం రద్దు చేసి, సమగ్ర సర్వే చేసి విచారణ చేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చిస్తుండగాపలువురు ఉద్యోగులు రావడంతో సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్వల్ప వివాదం జరగ్గా, ఛైర్మన్‌, ఈవో జోక్యంతో సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని