logo

ఉపాధి పనులపై కేంద్రం నిఘా

 ఉపాధి హామీ కింద చేపట్టిన వివిధ పనులు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన ఇళ్లను కేంద్ర బృందం (జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం) తనిఖీ చేస్తోంది. ఈ నెల 17న కేంద్ర బృందం సభ్యులు ధన్‌శ్యామ్‌పఠాక్‌, జయ్‌కుమార్‌ జిల్లాకు చేరుకుని డ్వామా కార్యాలయంలో

Published : 21 Jan 2022 04:42 IST


తుని మండలం లోవ కొత్తూరులో పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

 

కాకినాడ కలెక్టరేట్‌: ఉపాధి హామీ కింద చేపట్టిన వివిధ పనులు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన ఇళ్లను కేంద్ర బృందం (జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం) తనిఖీ చేస్తోంది. ఈ నెల 17న కేంద్ర బృందం సభ్యులు ధన్‌శ్యామ్‌పఠాక్‌, జయ్‌కుమార్‌ జిల్లాకు చేరుకుని డ్వామా కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ నెల 18 నుంచి క్షేత్రంలోతనిఖీలు ప్రారంభించారు. తుని, కోటనందూరు, జగ్గంపేట, పిఠాపురం మండలాల్లో..ఒక్కోచోట అయిదేసిగ్రామాలను ఎంపిక చేశారు. అక్కడ ఉపాధి హామీ అనుసంధానం పనులను తనిఖీ చేస్తున్నారు. గురువారం లోవకొత్తూరులో ఈ బృందం పనులను పరిశీలించింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో మార్పులు, చేర్పులు, ఇతర అంశాలు గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో డ్వామా అదనపు పీడీ మొఖలింగం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని