logo

ఆశ కార్యకర్తలపై పనిభారం తగ్గించండి

ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మండిపడ్డారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో

Published : 21 Jan 2022 04:42 IST


మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

మసీదుసెంటర్‌(కాకినాడ): ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మండిపడ్డారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, కార్మిక చట్టాల ప్రకారం సెలవులు మంజూరు, ఆరోగ్య బీమా అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ వందల మంది ఆశ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కాకినాడలోని డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. దీనికి ఎమ్మెల్సీ ఐవీ మద్దతు తెలిపారు. అనంతరం ఐవీ, ఆశ కార్యకర్తల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.బేబిరాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, యూనియన్‌ జిల్లా నాయకులు అన్నామణి, ఈశ్వరి తదితరులు మాట్లాడుతూ కరోనా సోకి చనిపోయిన ఆశ కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ నేటికీ అందలేదన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో డా.గౌరీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆశ కార్యకర్తల నియామకం జరుగుతుందని, ఖాళీల భర్తీపై కలెక్టర్‌తో మాట్లాడతామని, జిల్లా పరిధిలో లేని విషయాలపై అధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యూనియన్‌ నాయకులు ఎస్తేరురాణి, వెంకటలక్ష్మి, లలిత, సీతారత్నం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని